పుత్‌పాత్‌పై శవం కేసు: ఛేదించిన పోలీసులు

Delhi Footpath Assassination Case Police Arrested Three - Sakshi

న్యూఢిల్లీ : అంబేద్కర్‌ మార్కెట్‌.. టికోనా పార్క్‌ పుట్‌పాత్‌పై వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ప్రధాన నిందితుడు రాజు దర్బార్‌ మాట్లాడుతూ..‘‘ గత బుధవారం తొమ్మిదిన్నర ప్రాంతంలో మేము అంబేద్కర్‌ మార్కెట్‌లోని పుట్‌పాత్‌పై వంట వండుకుంటున్నాము. ఆ సమయంలో ఫుల్లుగా మద్యంతాగిన ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. మమ్మల్ని అక్కడ వంట చేసుకోవటానికి ఒప్పుకోలేదు. మా వంటలో ఇసుక, రాళ్లు వేశాడు. దీంతో విపరీతమైన కోపం వచ్చి అతడితో కలబడ్డాను. ఈ నేపథ్యంలోనే పెద్ద బండరాయితో అతడి రొమ్ముపై కొట్టాను. అతడు అక్కడే కుప్పకూలి పోయాడు. ( క్వారంటైన్‌లో కోడికూర ఇవ్వలేదని..)

మేము అతడి బాడీని అక్కడే పార్క్‌ చేసిన కార్ల మధ్య ఉంచి పరారయ్యాము’’ అని తెలిపాడు. కాగా, గురువారం ఉదయం 5.45 ప్రాంతంలో పాట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు టికోనా పార్క్‌ పుట్‌పాత్‌పై రక్తపు మడుగులో ఉన్న శవాన్ని కనుగొన్నారు. అతడ్ని అదే ప్రాంతానికి చెందిన మోమిన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే హంతకుల్ని పట్టుకోగలిగారు. (టిక్‌టాక్‌ పిచ్చిలో పిల్లికి ఉరేసి చంపాడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top