ఉద్యోగం పేరిట మోసం

Woman Arrest In Cheating  Case - Sakshi

మహిళ అరెస్ట్‌

తిరువళ్లూరు: విద్యుత్‌శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నలుగురి వద్ద రూ.13 లక్షలు వసూలు చేసి ఉడాయించిన మహిళను తిరువళ్లూరు డీసీబీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా గూళూరు భజన వీధికి చెందిన జయకుమార్‌. ఇతనికి విద్యుత్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అరక్కోణం ప్రాంతానికి చెందిన మూర్తి, పాండిచ్చేరికి చెందిన కుగన్, అతని భార్య త్రిపురసుందరి తదితరులు మొదట రూ.నాలుగు లక్షలు తీసుకున్నారు.

అనంతరం జయకుమార్‌ బంధువులకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో నలుగురి నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. తరువాత వారికి ఉద్యోగం ఇప్పించలేదు. బాధితులు నగదు తిరిగిఇవ్వాలని పలుసార్లు కోరినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తిరువళ్లూరు ఎస్పీ శిబిచక్రవర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ, తక్షణం విచారణ చేయాల్సింది క్రైమ్‌ పోలీసులను ఆదేశించారు. కేసును విచారించిన పోలీసులు మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో త్రిపురసుందరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 15 రోజులు రిమాండ్‌ విధించడంతో పుళల్‌ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top