ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య | Wipro Employee commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య

Jun 7 2018 11:27 AM | Updated on Nov 6 2018 8:04 PM

Wipro Employee commits Suicide in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌​: నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యతీష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాలివి.. బండ్లగూడకు చెందిన యతీష్‌ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ లేవుట్‌ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు లెటర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అందర్నీ కలచి వేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement