మేమెక్కడ మెదిలేది..?

Wildlife animals deaths in forests - Sakshi

వన్యప్రాణుల మూగ వేదన

మనిషి స్వార్థానికి అడవులు నాశనం

ఆహారం, నీళ్లు లేక విలవిల

జనావాసాల్లోకి జంతువులు

దాడులు, ప్రమాదాల్లో మృత్యువాత

కామారెడ్డి క్రైం: మనిషికి తన స్వార్థమే ముఖ్యమైపోయింది. ఎవరెలా పోతే తనకేంటి అనుకునేవారే నేటి కాలంలో ఎక్కువ. తోటి మనిషికి కష్టమొచ్చినా పట్టించుకోరు. అలాంటిది జంతు వు గురించి ఆలోచించేవారెవరు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా దట్టమైన అడవులకు పెట్టింది పేరు. దశాబ్దకాలంగా జిల్లాలో అడవుల విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. రోజురోజుకీ పరిస్థి తి అధ్వానంగా మారుతోంది. ఎక్కడికక్కడ అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోని సహజ సంపదను దోపిడీ చేస్తున్న దీ మనిషే. వన్యప్రాణికి అడవుల్లో ఆహారం అటుంచితే కనీసం నీళ్లు దొరకడం లేదు. అడవి లో కడుపు మాడ్చుకుంటున్న ప్రాణులు జనావాసాల్లోకి వస్తూ దాడులు, ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. అక్రమ కలప ర వాణా, అటవీ భూముల ఖబ్జా, అడవులను హరిస్తుండగా వేటగాళ్ల ఉచ్చులో పడుతూ ఎన్నో వన్యప్రాణులు మనుగడను కోల్పోతున్నాయి. అడవుల రక్షణకుగానీ, వన్యప్రాణుల సంరక్షణకు గానీ అటవీశాఖ చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యం. ఇందులో క్షేత్రస్ధాయిలోని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతరిస్తున్న అడవులు..
ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 52,113 హెక్టార్లు, ఆర్మూర్‌ పరిధిలో 33,778 హెక్టార్లు, కామారెడ్డి, బాన్సువాడ అటవీ డివిజన్‌ల పరిధిలో 82,173 హెక్టార్ల అడవులు ఉన్నాయి. కామారెడ్డి డివిజన్‌ పరిధిలో 4 రేంజ్‌లు, బాన్సువాడ పరిధిలో 4 రేంజ్‌లున్నా యి. వాటి పరిధిలో 35 సెక్షన్‌లు, 120 బీట్‌లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన జంతు గణన లో ఉమ్మడి జిల్లాలో 82 చిరుతలు, 165 ఎలుగుబంట్లు, 185 జింకలు, 32 మనుబోతులలో పా టు ఇతర జంతువులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదివరకటితో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య భారీగా తగ్గింది. అడవులు అంతరిస్తుండటంతో ఉన్న కొద్దిపాటి అడవుల్లో వన్య ప్రాణుల మనుగడకు తగిన పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. దశాబ్ద కాలంగా జిల్లాలో 40 శాతం అడవులు అన్యాక్రాంతానికి గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 

ఎలుగుబంటి దాడులు..  
ఏటా ఎలుగుబంటి దాడి ఘటనలు జిల్లాలోని చాలాచోట్ల జరుగుతున్నాయి. వేసవి ప్రారంభ మైందంటే అడవిలో ఏం దొరకని పరిస్ధితి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం, నీళ్లకోసం గ్రామా లు, పంటపొలాల్లోకి వస్తున్నాయి. జనం భయ బ్రాంతులకు గురి కావడమే కాకుండా జంతు వులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. 

మరెన్నో జంతువులు..  
ఇప్పడికే కోతులు అడవులు వదిలి పట్టణాలు, గ్రామాలకు చేరుకున్నాయి. కోతుల బెడద తీ వ్రంగా ఉందని గ్రామస్తులు ఇబ్బందులకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. అడవి పందులు ఆహారం కోసం పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. నెమళ్లు అడవుల్లో నీరు, ఆహారం దొరక్క ప్రధాన రహదారుల వెంట, గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. ఇవే కాక వేటగాళ్ల ఊచ్చు లో పడి మరెన్నో అటవీ జంతువులు బలవుతు న్నాయి. ఇది వరకు అటవీ జంతువులకు వేసవిలో తాగునీటి వసతికి సాసర్‌ పిట్‌లను ఏర్పా టు చేశారు. ఒక్క కామారెడ్డి డివిజన్‌ పరిధిలోనే 80 సాసర్‌ పీట్‌లను నిర్మించారు. అయితే వాటి నిర్వహణపై చాలా చోట్ల నిర్లక్ష్యం జరిగింది. భవిష్యత్తులో వీటి నిర్వహణ మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. ఉన్నతాధికారులు వన్యప్రాణులకు ఆహారం, నీటి సౌకర్యాలు కల్పించే విషయంలో మరింత దృష్టి సారించాలి. లేదంటే ఎన్నో ప్రాణులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.   

గతేడాది మేలో కామారెడ్డి మండలం గర్గుల్‌లోకి చొరబడిన ఎలుగుబంటి హంగామా సృష్టించింది. అటవీశాఖ అధికారులు మూ డు గంటలపాటు శ్రమించి ఎలుగుబంటిని బోనులో బంధించారు.  
గత అక్టోబర్‌లో సదాశివనగర్‌ మండలం యాచారం, ఉత్తనూరులకు సమీపంలోని పంటపొలాల్లో ఉపాధిహామీ కూలీలు, రైతులపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు రెండు చొట్ల వెలుగు చూసాయి.  
ఈసారి జనవరిలో గాంధారి మండలం గుర్జాల్‌తండా సమీపంలో ఎలుగుబంటి దాడిలో ఐదుగురు గాయపడ్డారు.
ఇటీవల తాడ్వాయి మండలం కన్‌కల్‌ శివారులోని పంట పొలాల్లోకి వచ్చిన ఎలుగుబంటి నలుగురిని గాయపర్చింది.

జింకలు, మనుబోతుల మృతి..
మొన్నటికి మొన్న నీళ్ల కోసం వచ్చిన మూడు మనుబోతు(నీల్‌గాయ్‌)లు నిజాంసాగర్‌ మండలం సింగితం రిజర్వాయర్‌ కాలువలో పడి బయటకు రాలేకపోయాయి. స్థానికులు, అధికారులు వాటిని బయటకు తీశారు. ఒక నీల్‌గాయ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి వాటిని దగ్గర్లోని అటవుల్లోకి వదిలేశారు.  
లింగంపేట మండలం మెంగారం శివారులో నవంబర్‌ 23న పం ట చేనులోకి వచ్చిన కొండగొర్రెను గ్రామస్తులు పట్టుకుని అధికారులకు సమాచారం ఇ చ్చారు. వారు సకాలం లో స్పందించక అది మృతి చెందింది. ఈ వ్యవహారంపై అప్పట్లో ఉన్నతాధికారులు విచారించారు.  
గతేడాది లింగంపేట మండలం శెట్‌పల్లి అడవుల్లో దాహార్తి తీర్చు కునేందుకు వచ్చి మనుబోతు సాసర్‌పిట్‌లో పడి మృతి చెందింది.  
మద్నూర్‌ మండలంలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సంఘటన ల్లో మూడు జింకలు రోడ్లపై వాహనాలు ఢీకొని మృతి చెందాయి.

ప్రమాదాల బారిన చిరుతలు..
ఇటీవల చిరుతలు జనావాసాలపైపు రావడం పెరిగింది. రెండు నెలల వ్యవధిలో మూడు చిరుతలు మృతి చెందాయి. జిల్లాలో అడవుల వెంబడి ఉన్న చాలా గ్రామాల శివారు ప్రాంతాల్లో నిత్యం చిరుతల సంచారం ఉన్నట్లుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
గత జూలైలో ఆహారం కోసం వచ్చిన ఓ చిరుత మల్లారం ప్రాంతంలోని కరెంట్‌ స్తంభం ఎక్కి విద్యుత్‌షాక్‌తో చనిపోయింది.  
నెల క్రితం సిర్నాపల్లి అటవీప్రాంతంలో గుర్తుతెలియని రైలు ఢీకొన్న ఓ చిరుతను అధికారులు వైద్యం అందించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.  
వారం క్రితం జగ్గారావుఫారం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుత అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెల్సిందే.  
గతంలో గాంధారి మండలం మాతుసంగెం శివారులోని ఓ కుంట పొదల్లో దూరిన చిరుత గ్రామస్తుల దాడిలో మృతిచెందింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top