అశ్లీల వీడియో చూసి ఆగ్రహంతో భర్త..

Wife Obscene Video Punjab NRI Kills Family - Sakshi

ఛంఢీగఢ్‌: భార్య అశ్లీల వీడియో చూసి భరించలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అతను.. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కుల్విందర్‌ సింగ్‌(35) జోర్డాన్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య, పిల్లలు స్వగ్రామం కలసింగియాలోనే ఉంటున్నారు. అయితే గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తితోపాటు మరో ముగ్గురు ఆమె అశ్లీల వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. చివరకు ఆ వీడియోను భర్తను పంపటంతో కుల్విందర్‌ ఇండియాకు తిరిగొచ్చాడు. భార్య వ్యవహారం బయటపడటంతో తట్టుకోలేక పెట్రోల్‌ పోసి కుటుంబాన్ని చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కపుర్తలా పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top