జూబ్లీహిల్స్‌లో కోడిపందాలు: 20 కోళ్లు, నగదు స్వాధీనం | west zone task force raide on cock fight places | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కోడి పందాలు: 20 కోళ్లు, నగదు స్వాధీనం

Jan 7 2018 6:38 PM | Updated on Sep 4 2018 5:32 PM

west zone task force raide on cock fight places - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అత్యంత ప్రముఖులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్‌లోనూ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు కోడి పందాల స్థావరాలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా 20 పందెం కోళ్ళను స్వాధీనం చేసుకుని 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 25 సెల్‌ఫోన్లు, రూ.70 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement