తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి! | Wedding to a nine year old child in Aurangabad | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!

Nov 13 2019 3:36 AM | Updated on Nov 13 2019 3:36 AM

Wedding to a nine year old child in Aurangabad - Sakshi

ఔరంగాబాద్‌: డబ్బుకు ఆశపడి తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి చేయాలని చూసిన ఓ మహిళను ఔరంగాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా మజల్‌గావ్‌లో చోటు చేసుకుంది. ఆశామతి గోలప్‌ అనే మహిళ రూ. 30 వేల కోసం తన బిడ్డను, మిత్రురాలి కొడుక్కిచ్చి బాల్యవివాహం చేయడానికి నిశ్చయించింది. ఆదివారానికి పెళ్లి ముహూర్తం పెట్టుకోగా, స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు పెళ్లి వేదికకు చేరుకుని ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులపై బాల్య వివాహాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement