పెళ్లికూతురిపై అనుమానం.. ఆగిన పెళ్లి | Wedding Cancelled After Groom Family Suspected On Bride | Sakshi
Sakshi News home page

Sep 3 2018 9:53 AM | Updated on Sep 3 2018 5:10 PM

Wedding Cancelled After Groom Family Suspected On Bride - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి కూతురుపై అనుమానంతో చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పీటలపై నుంచి లేచిపోయాడు..

సాక్షి, కృష్ణజిల్లా : పెళ్లి పీటల దాకా వచ్చి చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన జిల్లాలోని తోట్లవల్లూరులో చోటు చేసుకుంది. పెళ్లి కూతురుపై అనుమానంతో చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పీటలపై నుంచి లేచిపోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే పామర్రు మండలం నిభానిపూడికి చెందిన నాగశ్రీనుకి తోట్లవల్లూరు వాసి దివ్యకు రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్‌ 2న పెళ్లి కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం పెళ్లి పీటలకు వరకు వచ్చిన నాగశ్రీను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి కూతరు కుటుంబ సభ్యులు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పెళ్లి కొడుకు వాళ్ల తల్లితండ్రులు మాటలు విని తనపై లేనిపోని అబాండాలు మోపి, అనుమానపడి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోయాడని పెళ్లికూతురు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించింది.  

Advertisement
 
Advertisement
Advertisement