దారుణం: ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై.. | Ward Boy Molested Woman Patient In ICU | Sakshi
Sakshi News home page

దారుణం: ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై..

Sep 1 2019 4:11 PM | Updated on Sep 1 2019 4:19 PM

Ward Boy Molested Woman Patient In ICU - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న అచ్యుత్‌ రావ్‌ అనే వార్డ్‌బాయ్‌..

సాక్షి, హైదరాబాద్‌ : ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వార్డ్‌బాయ్‌. బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ 30ఏళ్ల మహిళ డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అనంతరం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను ఐసీయూకు మార్చారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న అచ్యుత్‌ రావ్‌ అనే వార్డ్‌బాయ్‌ ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉన్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

కొద్దిరోజుల తర్వాత కోలుకున్న బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement