చిట్టిమాము బర్త్‌డే సెలబ్రేషన్స్‌‌.. అరెస్ట్‌ | Vizag Taskforce Police Arrest Rowdy Sheeter Chitti Mamu | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో రౌడీషీటర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. 

Jun 7 2020 12:27 PM | Updated on Jun 7 2020 12:48 PM

Vizag Taskforce Police Arrest Rowdy Sheeter Chitti Mamu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : బర్త్‌డే సెలబ్రేషన్స్‌ పేరుతో నగరంలో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ చిట్టిమాము గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిట్టిమాము బర్త్‌డే సందర్భంగా శనివారం అర్ధరాత్రి అతడి సన్నిహితులు భారీ ఎత్తున వేడుకలు ఏర్పాటు చేశారు. సినీ ఫక్కీలో నగరంలోని రౌడీషీటర్లు, బౌన్సర్లు, మందు, విందుతో నానా హంగామా సృష్టించారు. అయితే ఈ బర్త్‌డే పార్టీ గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రైడ్‌ చేశారు. చిట్టిమాముతో పాటు పార్టీకి హాజరైన వారిని, బౌన్సర్లను అదుపులోకి తీసుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలం నుంచి భారీగా మద్యం, గంజాయి, రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)

రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదు: డీఎస్పీ
విశాఖలో రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదని టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ త్రినాథరావు పేర్కొన్నారు. నగరంలోని రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. చిట్టిమాము గ్యాంగ్‌ బర్త్‌డే వేడుకలకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో దాడి‌ చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నగరంలో గ్యాంగ్‌ల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు డీఎస్పీ త్రినాధరావు విజ్ఞప్తి చేశారు. ఇక రౌడీషీటర్‌ చిట్టిమాముపై పలు మర్డర్‌ కేసులు ఉన్న విషయం తెలిసిందే. (భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement