దొంగగా భావించి యువకుడిపై పెట్రోల్‌

Utter Pradesh Dalit Man Mistaken for Thief And Set Afire Dies - Sakshi

లక్నో: తెల్లవారు జామున వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఓ ఇంట్లో దూరి.. ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. వివరాలు.. బారాబంకి, రాఘోపూర్‌ గ్రామం.. దేవా ప్రాంతానికి చెందిన సుజిత్‌ కుమార్‌ ఈ నెల 19 తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తన మేనల్లుడి ఇంటికి వెళ్లాడు. పూర్తిగా తెల్లవారకపోవడం.. వెలుతురు సరిగా లేకపోవడంతో సుజిత్‌ని చూసిన వీధికుక్కలు అరుస్తూ అతడి వెంటపడటం ప్రారంభించాయి.

కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు సుజిత్‌ ఓ ఇంట్లో దూరాడు. అయితే సుజిత్‌ని దొంగగా భావించిన సదరు కుటుంబ సభ్యులు అతడిని చితకబాదడమే కాక పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన సుజిత్‌ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. సుజిత్‌ మీద దాడి చేసిన ఇద్దరు యువకుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top