డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

Two Vehicle Collision Nine Men Dead In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లకుర్చి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓమినీ బస్‌, మినీ వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఓమిని బస్సు కోయంబత్తూరు నుంచి చెన్నైని వెళ్తోంది. అదేసమయంలో 14 మంది కార్మికులతో మినీ వ్యాన్‌ ఉతిరమెరూర్‌ నుంచి కంగెయాం వైపు ప్రయాణిస్తోంది. వ్యాన్‌ అదుపుతప్పడంతో అన్నానగర్ ఫ్లైఓవర్‌ వద్ద  ఎదురుగా వస్తున్న ఓమినీ బస్‌ను ఢీకొట్టింది. ప్రమాదస్థలంలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో జార్ఖండ్‌కు చెందిన ఏడుగురు కార్మికులు, రెండు వాహనాలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. క్షతగాత్రులను కల్లకుర్చి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top