బెజవాడలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం | Two Tons Of Ganja Seizes In Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం

Aug 5 2018 11:46 AM | Updated on Oct 8 2018 6:18 PM

Two Tons Of Ganja Seizes In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ: సుమారు రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ర్ట వెళ్తున్న రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. రామవరప్పాడు వద్ద ఒక కారు దొరకగా..పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ పోయిన మరో కారును ఇబ్రహీంపట్నం వద్ద చేజ్‌ చేసి పట్టుకున్నారు. రెండు కార్లలో కలిపి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన నలుగురూ మహారాష్ర్టకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement