హైదరాబాద్‌లో దారుణం.. | Two People Trying To Kill New Born Baby In Hyderabad | Sakshi
Sakshi News home page

పసికందు బతికి ఉండగానే..

Oct 31 2019 2:15 PM | Updated on Oct 31 2019 2:53 PM

Two People Trying To Kill New Born Baby In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికి ఉన్న శిశువును పాతిపెట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను అరెస్ట్‌ చేశారు. నగరంలోని జేబీఎస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు దుండగులు అప్పుడే పుట్టిన పసికందును అంతమొందించాలని చూశారు. చిన్నారిని దుండగులు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన ఓ ఆటో డ్రైవర్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు.


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను విచారించారు. తమ మనవరాలు చనిపోవడంతో పూడ్చిపెడుతున్నామని వారు పోలీసులకు తెలిపారు. అయితే వారి మాటలపై నమ్మకం కలగని పోలీసులు శిశువును చూడగా.. చిన్నారి ప్రాణాలతోనే ఉంది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆడపిల్ల పుట్టడంతోనే వారు ఈ చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement