కేకు తెస్తానని వెళ్లి అదృశ్యం | two men disappear on 31st dec night | Sakshi
Sakshi News home page

కేకు తెస్తానని వెళ్లి అదృశ్యం

Jan 5 2018 9:41 AM | Updated on Oct 17 2018 4:29 PM

two men disappear on 31st dec night - Sakshi

సికిందర్‌(ఫైల్‌) రాములు (ఫైల్‌)

మోమిన్‌పేట(వికారాబాద్‌): కేక్‌ తీసుకొస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన షేక్‌ సికిందర్‌ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, డిసెంబరు 31న రాత్రి నూతన సంవత్సర వేడుకల కోసం స్థానికంగా కేకు కొనుగోలు చేసుకొని వస్తానని ఇంట్లో భార్య శభానాబేగంతో చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భయాందోళనకు గురైన సికిందర్‌ భార్య గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌ తెలిపారు.

మరో ఘటనలో..
మాడ్గుల(ఆమనగల్లు): ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై గిరిష్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి రాములు(35) ఈనెల 3న పనినిమిత్తం మాడ్గులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం కొద్దిసేపు ఇంటి వద్ద ఉన్న ఆయన కనిపించకుండా పోయాడు. రాములు కోసం కుటుంబసభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో గురువారం రాములు సోదరుడు కరుణాకర్‌ మాడ్గుల పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement