రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు దుర్మరణం | TV Actor Mano Died Road Accident In Chennai | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు దుర్మరణం 

Oct 30 2019 10:42 AM | Updated on Oct 30 2019 10:42 AM

TV Actor Mano Died Road Accident In Chennai - Sakshi

పెరంబూరు: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు దుర్మణం పాలయ్యాడు. అతని భార్య ప్రాణాప్రాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. పోలీసుల వివరాలు మేరకు.. స్థానిక కొరట్టూర్, బాబానగర్‌ 10వ వీధికి చెందిన మనోమోహన్‌వేల్‌(37) బుల్లితెర నటుడు. ఇతని భార్య లివియ(26). దంపతులిద్దరు సోమవారం మధ్యాహ్నం గుడువాంజర్‌లోని మిత్రుడి ఇంటికి కారులో వెళ్లారు. అనంతరం రాత్రి ఇంటికి తిరిగి బయలు దేరారు.  కారు ఆవడి సమీపంలో వెళుతుండగా అదుపుతప్పి రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మనోమోహన్‌వేల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పూందమల్లి పోలీసులు గాయపడ్డ లివియాను వెంటనే ఆవడి ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అంబత్తూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపారు. మనోమోహన్‌వేల్‌ మృతదేహాన్ని  పోస్ట్‌మార్టం కోసం పోరూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పూందమల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement