బస్సు, ట్రాక్టర్‌ ఢీ: ముగ్గురు మృతి | Tractor-bus accident-3 persons dies | Sakshi
Sakshi News home page

బస్సు, ట్రాక్టర్‌ ఢీ: ముగ్గురు మృతి

Jan 10 2018 7:34 PM | Updated on Jan 10 2018 7:34 PM

సాక్షి, అన్నానగర్‌: బస్సు, ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అరుప్పుకోట సమీపంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. విరుదునగర్‌ నుంచి అరుప్పుకోటకు 45మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో అరుప్పుకోట సమీపం పులియంపట్టి గుండా వెళుతుండగా ఎదురుగా 20మందితో వచ్చిన ట్రాక్టర్‌ బస్సును ఢీకొనడంతో బస్సు బోల్తాపడింది. బస్సు ప్రయాణికులలో సెల్వం (53), అరుణ్‌ (19), మారిశ్వరన్‌ (19)లు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్‌ చిత్రస్వామి సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను అరుప్పుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement