కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి మహిళపై అత్యాచారం

Three Young Men Arrest In Woman Molestation Case  - Sakshi

ముగ్గురు యువకుల అరెస్ట్‌

సేలం: భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం కలిపిన శీతలపానీయం తాగించి అత్యాచారం చేసిన ముగ్గురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల మేరకు.. ధర్మపురి జిల్లా అరూర్‌ తాలూకా మొరప్పూర్‌ గ్రామానికి చెందిన మహిళ (25) వివాహిత. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమెకు తండ్రి లేడు, తల్లి మూగ. ఈ స్థితిలో తాత అనారోగ్యం కారణంగా 20 రోజుల కిందట సేలం జీహెచ్‌లో చేరారు. ఆయన కోసం మహిళ ఆస్పత్రికి వెళ్లి వచ్చేది. ఆస్పత్రిలో సేలం సమీపం అలగాపురానికి చెందిన నయీమ్‌ (25)తో పరిచయం ఏర్పడింది. గత 29న నయీమ్‌ ఆమెతో ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. తర్వాత ఆమెను సేలం, ఏర్కాడు ప్రాంతాలకు తీసుకెళ్లి చత్తిరంలోని లాడ్జిలో దిగారు.

ఆమెకు మద్యం కలిపిన శీతలపానీయాన్ని తాగించి నయీమ్, అతని సోదరుడు నఫీస్‌ (29), స్నేహితుడు రంజిత్‌  అత్యాచారం చేశారు. మత్తు నుంచి మేల్కొన్న తర్వాత ఆమెను కత్తితో బెదిరించి మళ్లీ అత్యాచారం చేశారు. ఆమె వద్ద నుంచి ఏటీఎం కార్డు తీసుకుని రూ.30వేలు నగదు డ్రా చేశారు. విషయం బయటకుచెబితే ఆమె తల్లిని హత్య చేస్తామని బెదిరిం చారు. అనంతరం వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బుధవారం డైఫీ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు చెప్పింది. ఆయన సహాయంతో  గురువారం సేలం కమిషనర్‌ శంకర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గురువారం నయీమ్, నఫీస్, రంజిత్‌లను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top