విహారంలో విషాదం.. చెట్టును ఢీకొట్టిన స్కార్పియో..! | Three Vizianagaram Natives Died In Road Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విహారంలో విషాదం.. చెట్టును ఢీకొట్టిన స్కార్పియో..!

Oct 28 2019 10:06 PM | Updated on Oct 28 2019 10:37 PM

Three Vizianagaram Natives Died In Road Accident In Visakhapatnam - Sakshi

స్కార్పియో చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

సాక్షి, విశాఖపట్నం : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దంతివాడకు వెళ్తున్న స్కార్పియో వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్కార్పియో చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

స్కార్పియోలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు మహిళలు ఒక పురుషుడు మృతి చెందారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న దంతేవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయనగరం విమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సునీత కుటుంబ సభ్యులుగా గుర్తించారు. దంతేవాడలోని దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకొని, జగదల్పూర్‌లోని జలపాతాలను ఆస్వాదించడానికి డాక్టర్ సునీత కుటుంబంతో సహా వెళ్లినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement