వసతి గృహంలో దారుణం.. గర్భం దాల్చిన విద్యార్థినులు!

Three students conceived  In Telangana Tribal Welfare Residential Degree College Asifabad - Sakshi

సాక్షి, కొమురం భీం జిల్లా : అసిఫాబాద్‌లో ట్రైబల్‌ మహిళా డిగ్రీ కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్‌ హాస్టల్‌ ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెంటల్‌ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్‌ సిబ్బంది వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు.

పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పాజిటీవ్‌ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్‌ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా..సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top