విషాదం: భార్య కళ్లెదుటే భర్త.. చెల్లెళ్లు మృతి | Three Died At Bommapur Reservoir | Sakshi
Sakshi News home page

విషాదం: భార్య కళ్లెదుటే భర్త.. చెల్లెళ్లు మృతి

Jun 1 2019 3:56 PM | Updated on Jun 1 2019 4:22 PM

Three Died At Bommapur Reservoir - Sakshi

సాక్షి, జనగామ: జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు జలశయంలో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో చెరువులో మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటన బొమ్మకూర్‌ జలాశయం వద్ద శనివారం జరిగింది. చెరువులో గల్లంతైన వారిలో బావ మరదళ్లు అవినాష్ (32)‌, సంగీత (19), సుమలత (20) ఉన్నారు. కాగా ఇద్దరు మరదళ్లతో కలిసి చెరువులోకి దిగిన అవినాష్‌.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ దృశ్యానంతా అవినాష్‌ భార్య ఫోన్‌లో రికార్డు చేస్తునే ఉన్నారు. అప్పటి వరకు నీళ్లలో అడిన ముగ్గరు ఒక్కసారిగా చెరులో గల్లంతయ్యారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. మృతులంతా రఘునాథపల్లి మండలం మేకలగుట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా సెల్ఫీ దిగే క్రమంలో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోంది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement