తూర్పుగోదావరిలో దారుణ హత్య | Three Arrested In Murder Case | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలో దారుణ హత్య

Mar 15 2020 7:38 PM | Updated on Mar 15 2020 8:47 PM

Three Arrested In Murder Case - Sakshi

సాక్షి, చింతూరు: తూర్పుగోదావరి ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడినే అన్న హత్య చేయించిన ఘటన చింతూరు మండలం తుమ్మల గ్రామంలో జరిగింది. సోదరులైన సోడే ముత్తయ్య, నాగిరెడ్డిల మధ్య పొలం వివాదం నడుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎలాగైనా తమ్ముడిని చంపాలని అన్న సోడే ముత్తయ్య నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కిరాయి వ్యక్తులతో తమ్ముడు నాగిరెడ్డిని హత్య చేయించాడు. మృతదేహాన్ని నిందితులు వాగులో పూడ్చిపెట్టారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement