అంతు చూస్తామంటూ కిషన్‌రెడ్డికి బెదిరింపులు | Threatening Phone Call To BJP Leader kishan Reddy | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డికి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌

Apr 24 2019 8:43 PM | Updated on Apr 24 2019 8:51 PM

Threatening Phone Call To BJP Leader kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కిషన్‌రెడ్డికి కాల్‌ చేసిన అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కిషన్‌రెడ్డి అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై కిషన్‌రెడ్డి బుధవారం కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. కిషన్‌రెడ్డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా కిషన్‌రెడ్డికి ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement