‘పరిటాల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని’

Threat To My Family From Parital Sunitha Said By Anantpur YSRCP Leader Mahananda Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెల్సిందే. తాజాగా ప్రసాద్‌ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. ప్రసాద్‌ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. 

టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్‌ జారీ చేశారు. దీనిపై ప్రసాద్‌ రెడ్డి సోదరుడు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహానందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన అన్నను చంపినట్టే తననూ హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన భూమిలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. మంత్రి పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మహానంద రెడ్డి విలేకరుల ఎదుట వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top