విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్‌ | Theives Rob Visakha Express At Nidadavolu | Sakshi
Sakshi News home page

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్‌

Apr 20 2018 9:54 AM | Updated on Aug 30 2018 5:27 PM

Theives Rob Visakha Express At Nidadavolu - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నిడదవోలు సమీపంలోని కాల్దరి - సత్యవాడ స్టేషన్ల మధ్య రైలు చైన్‌ లాగిన దొంగలు మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఎస్‌ 6 నుంచి ఎస్‌ 13 వరకూ గల బోగీల్లో దుండగులు దోపిడికి పాల్పడినట్లు తెలిసింది.

దోపిడి సమయంలో 28 నిమిషాల పాటు రైలు మార్గం మధ్యలో రైలు నిలిచిపోయిందని బాధితులు తెలిపారు. సుమారు 170 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లినట్లు సమాచారం. దాదాపు 10 మంది దుండగులు ఈ దోపిడిలో పాల్గొన్నట్లు తెలిసింది. నిడదవోలు రైల్వే స్టేషన్‌ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement