సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరులో శనివారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. 40 గ్రాముల బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.