బిగ్‌బాస్‌ 3 సెట్‌లోకి పోలీసులు.. ఏ క్షణమైనా వనిత అరెస్ట్!

Telangana Police Gone to Chennai to Arrest Vanitha - Sakshi

సాక్షి, చెన్నై : సీనియర్ నటులు మంజుల, విజయ్‌ కుమార్‌ల పెద్ద కుమార్తె వనిత వివాదం మరింత ముదురుతోంది. గత పదేళ్లుగా వనిత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు.  కొంత కాలం పాటు తండ్రితో గొడవపడిని వనిత, భర్తనుంచి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతనితో గొడవపడుతున్నారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా ఉన్న వనితను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు.

2007 ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూతురు జోవిత సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతరిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్టుగా ఆనంద్‌ రాజ్‌ తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మేరకు వనితపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన విచారణ జరిపిన పోలీసులలు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు.

ఇప్పటికే బిగ్‌బాస్‌ సెట్‌ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సెట్‌లో ఉన్న వనితను తెలంగాణ పోలీసులు ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top