అశ్లీల వీడియోలు చూపి అడ్డంగా బుక్కయ్యాడు..

 Teacher Held For Showing Obscene Videos To Minor Girls - Sakshi

భోపాల్‌ : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పాడు బుద్ధి ప్రదర్శించి కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని పండగోన్‌ గ్రామంలో మైనర్‌ బాలికలకు అశ్లీల వీడియోలు చూపిన ఆరోపణలపై ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధిత విద్యార్థినులు  టీచర్‌ వికృత చేష్టలను తల్లితండ్రులకు వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేశామని ఏఎస్పీ సమీర్‌ యాదవ్‌ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top