లైంగిక వేధింపులు: ఉపాద్యాయుడిపై కేసు నమోదు | ​Teacher Harassment On Student In Pulivendula At Kadapa | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు: ఉపాద్యాయుడిపై కేసు నమోదు

Dec 2 2019 8:10 PM | Updated on Dec 2 2019 9:02 PM

​Teacher  Harassment On Student In Pulivendula At Kadapa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చిన సంఘటన ఇది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడే కామంతో కళ్లు మూసుకుపోయి పాఠశాలలో చదివే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పులివెందుల పట్టణంలోని రవీంద్రనాథ ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి చదివే విద్యార్థినిపై కృష్ణనాయక్‌ అనే ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement