వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి | TDP Leaders Attack On YSRCP Leaders Anantapur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

Jul 8 2018 7:50 AM | Updated on Aug 20 2018 6:10 PM

TDP Leaders Attack On YSRCP Leaders Anantapur - Sakshi

దాడిలో గాయపడిన రవీంద్ర, సురేష్‌

నల్లమాడ: మండల కేంద్రం నల్లమాడలోని దళితవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రవీంద్ర, సురేష్‌లపై అదే కాలనీకి చెందిన టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి దాడిచేశారు. బాధితులు తెలిపిన మేరకు...ఉపాధి హామీ పనుల్లో టీడీపీకి చెందిన ఎ.రామచంద్ర బినామీ పేర్లతో బిల్లులు స్వాహా చేస్తున్నాడు. ఈ విషయమై రామచంద్రను పని ప్రదేశంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రవీంద్ర, సురేష్‌లు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీన్ని మనసులో పెట్టుకున్న రామచంద్ర శుక్రవారం రాత్రి పొద్దుపోయాక పూటుగా మద్యం తాగి చిన్నాన్న నాగప్పతో కలసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇంటికెళ్లి ‘మమ్మల్నే ఎదిరిస్తారా? ఎంత ధైర్యం రా మీకు’ అంటూ కర్రలతో దాడి చేశారు.

ఈ దాడిలో రవీంద్ర, సురేష్‌ గాయపడ్డారు. రక్తగాయాలతోనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి కదిరికి వెళ్లి ఆస్పత్రిలో చేరారు. టీడీపీ వర్గీయుల నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు. దీనిపై ఏఎస్‌ఐ బషీర్‌ఖాన్‌ను వివరణ కోరగా ఇరువర్గాల వారు గాయపడి స్టేషన్‌కు రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి పంపామని, అక్కడి నుంచి రిపోర్టు రాగానే ఇరువర్గాల వారిపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement