నాభార్య పోస్టుకే లైక్‌ కొడతావా ?: టీడీపీ నేత | TDP Leader Yathendra Ramakrishna In Another Controversy | Sakshi
Sakshi News home page

నాభార్య పోస్టుకే లైక్‌ కొడతావా ? : టీడీపీ నేత

Jun 28 2018 10:25 AM | Updated on Oct 22 2018 6:10 PM

TDP Leader Yathendra Ramakrishna In Another Controversy - Sakshi

భీమవరపు యతేంద్ర రామకృష్ణ

సాక్షి, విజయవాడ : భార్యను మానసికంగా వేధిస్తూ వార్తల్లో నిలిచిన కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ యువనేత భీమవరపు యతేంద్ర రామకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని ఆయన భార్య, తెలప్రోలు గ్రామ సర్పంచ్‌ హరిణికుమారి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పైగా రోజురోజుకు వేధింపులు హెచ్చుమీరడంతో సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని తెలుగింటి ఆడపడుచుకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోలు, పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హరిణికుమారి పెట్టిన పోస్టుకు తెలప్రోలుకు చెందిన భీమవరపు నాగిరెడ్డి లైక్‌ కొట్టాడు. దీంతో కోపం పెంచుకున్న యతేంద్ర రామకృష్ణ, నా భార్య పోస్టుకే లైక్‌ కొడతావా అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం వీరవల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement