నగరంలో భారీగా నగదు స్వాధీనం | Task Force Police Seized Huge Money In Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో భారీగా నగదు స్వాధీనం

Apr 7 2019 3:59 PM | Updated on Apr 7 2019 3:59 PM

Task Force Police Seized Huge Money In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరంలో భారీ స్థాయిలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తుల నుంచి 47 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థికి చెందిన జయవీర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోటి రూపాయలు స్వాధీన పర్చుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్‌ సూచనల మేరకు నగదు సరఫరాపై దృష్టి సారించామన్నారు. నగరంలో నేడు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు తెలిపారు. 8 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ మొత్తాన్ని లోకల్‌పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహాయంతో పట్టుకున్నట్లు తెలిపారు. సోమాజిగూడలో ఏప్రిల్‌ 6న సాత్విక్‌ రెడ్డి, సౌరభ్‌ల నుంచి 26లక్షలు, మూసారంబాగ్‌లో తండ్రా కాశీనాథ్‌ రెడ్డి, భుక్యా రవిల నుంచి 34లక్షలు, బంజారహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 14లో మల్లారెడ్డి శ్రీనివాస్‌ నుంచి కోటి నగదును, బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద బొడుపల్లి శ్రీనయ్య నుంచి కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement