ఈతకెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం

సాక్షి, దావణగెరె: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని దావణగెరె నగరానికి సమీపంలోని ఆవరగెరెలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఈత కొట్టేందుకు ఆవరగెరెకు చెందిన గిరీష్‌(10), ​ధృవ(10)లు చెరువులోకి దిగారు. అయితే బురదలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో గాలింపు జరిపి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యానగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top