మృత్యువుతో పోరాడి ఓడిన ప్రియురాలు

Suicide Attempt Lover Died in Hospital Srikakulam - Sakshi

ఆమె కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు

విషాదంతో ముగిసిన ప్రేమకథ

శ్రీకాకుళం ,వీరఘట్టం: ప్రేమ జంట కథ చివరకు విషాదాంతంతో ముగిసింది. పెద్దలను ఎదురించలేక తమలో ఉన్న ప్రేమను చంపుకుని ఆదివారం విశాఖపట్నంలోని కైలాసగిరిపై మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్నాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ప్రియుడు చౌడాడ సత్యనారాయణ ఆదివారమే చనిపోగా ప్రియురాలు రౌతు కమల మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. ఆమె కుటుంబ సభ్యులు కమల కళ్లను కేజీహెచ్‌ వైద్యుల సమక్షంలో దానం చేశారు. ఆదివారం సత్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్వగ్రామం అడారులో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కమల మృతదేహానికి కేజీహెచ్‌ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామం అడారులోనే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. అడారులో విషాదం అలముకుంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top