దారుణం : తల, మొండెం వేరు చేసి.. | Son In Law Killed His Mother In Law | Sakshi
Sakshi News home page

అత్తను అత్యంత కిరాతకంగా నరికి చంపిన అల్లుడు

May 19 2019 5:58 PM | Updated on May 19 2019 5:58 PM

Son In Law Killed His Mother In Law - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి :  జిల్లాలోని కుక్కునూరు మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. అత్తను అత్యంత కిరాతకంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ దుర్మార్గపు అల్లుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల గూడెంకు చెందిన రాజ, తన భార్యకు గొడవ జరిగింది. తమ మధ్య కలహాలకు అత్త ముడివి నాగమ్మ(65) కారణం అని అనుమానించిన రాజు ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. వేట కత్తి తీసుకొని చింతల గూడెం వచ్చిన రాజు.. నాగమ్మను అత్యంత దారుణంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పాడేశాడు. అనంతరం కుక్కునూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. రాజుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement