మామ మోసం చేశాడని.. | Son in Law Commits SUicide Attempt in Kurnool | Sakshi
Sakshi News home page

మామ మోసం చేశాడని.. అల్లుడి ఆత్మహత్యాయత్నం

Mar 8 2019 1:35 PM | Updated on Mar 8 2019 1:35 PM

Son in Law Commits SUicide Attempt in Kurnool - Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: పిల్లనిచ్చిన మామే వ్యాపారంలో మోసం చేశాడనే మనస్తాపంతో అల్లుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. స్థానిక లక్ష్మీ పేటలో నివాసముంటున్న దస్తగిరి పట్టణానికే చెందిన రామాంజనేయులు కూతురు విమళాదేవిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మామా అల్లుడు కలిసి ఆదోని రోడ్డులో ఫ్యామిటీ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. రెస్టారెంటుకు పెట్టుబడి నిమిత్తం మామ రామాంజనేయులు అల్లుడితో దాదాపు రూ.6లక్షలు అప్పు చేయించాడు. అనంతరం అల్లుడితో గొడవ పడి దూరం పెట్టాడు. అప్పునకు వడ్డీ, రెస్టారెంట్‌కు అద్దె భారం అల్లుడిపైనే పడింది. ఇదేవిషయమై పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా చర్యలు లేకపోవడంతో మనస్థాపానికి గురై గురువారం ఎలకల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement