పెంపుడు తండ్రిని కడతేర్చిన కొడుకు | son killed step father and attack mother | Sakshi
Sakshi News home page

పెంపుడు తండ్రిని కడతేర్చిన కొడుకు

Oct 2 2017 7:03 PM | Updated on Oct 2 2017 7:03 PM

son killed step father and attack mother

నాగయ్య మృతదేహం , చికిత్స పొందుతున్న సావిత్రి

వరంగల్‌, పలిమెల(మంథని): మద్యం మత్తులో వ్యక్తి తల్లిదండ్రులపైనే దాడి దిగాడు. ఈ దాడిలో పెంపుడు తండ్రిని హతమవగా.. తల్లి గాయాలపాలైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పంకెన గ్రామ శివారులోని మోదేడు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహదేవ్‌పూర్‌ సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం సావిత్రికి ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో అదే గ్రామానికి చెందిన మల్లెల నాగయ్య (55)ను 15 సంవత్సరాల క్రితం రెండో వివహం చేసుకుంది.

సావిత్రి పెద్ద కుమారుడు ప్రభాకర్‌కు, నాగయ్యకు మధ్య విబేధాలుండేవి. ప్రభాకర్‌ విపరీతంగా మద్యంసేవించి తల్లి సావిత్రి, తండ్రి నాగయ్యలపై ఇంటి వద్దే గొడ్డలితో దాడి చేశాడు. నాగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థాని కులు మహదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాగయ్య మృతదేహానికి మహదేవ్‌పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిం దితుడిని అదుపులోకి తీసుకోని విచా రిస్తున్నట్లు సీఐ రమేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement