పుణేలో కోరుట్ల యువతి ఆత్మహత్య

Software Employee Suicide In Pune - Sakshi

కోరుట్ల: పుణేలో కోరుట్ల యువతి పిట్ల మౌనిక(23) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కోరుట్లలో నివాసముంటున్న పిట్ల శేషు–జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. తండ్రి శేషు ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లగా తల్లి జ్యోతితో కలిసి మౌనిక కోరుట్లలో ఉంటోంది. రెండేళ్ల క్రితం పుణేలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. వారంక్రితం ఆ కంపెనీలో తక్కువ జీతం ఉండడంతో పని మానేసి వేరే కంపెనీలో ఉద్యోగంకోసం ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం.

ఇంటర్వ్యూలో సక్సెస్‌ కాలేదనే తీవ్ర ఒత్తిడిలో బుధవారం సాయంత్రం తల్లికి ఈ విషయం ఫోన్‌లో చెప్పి బాధపడినట్లు సమాచారం. అనంతరం సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆందోళన చెందిన తల్లి జ్యోతి వివరాలు తెలుసుకునేందుకు యత్నించగా మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం అందింది. ఈ విషయంపై పుణేలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తల్లి జ్యోతి, బంధువులు మౌనిక ఆత్మహత్యతో తీవ్ర విషాదంలో మునిగి పోయారు. మౌనిక తండ్రి శేషు దుబాయ్‌ నుంచి వచ్చినట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top