ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని.. | Software Company MD Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..

Jun 5 2019 7:44 AM | Updated on Jun 5 2019 7:44 AM

Software Company MD Commits Suicide in Hyderabad - Sakshi

నిఖిల్‌రెడ్డి మృతదేహం

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎండీ ఆత్మహత్య

అమీర్‌పేట: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది చేసిందని మనస్తాపానికిలోనైన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపనీ ఎండీ ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మంగళవారం అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్‌రెడ్డి (27) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని శ్రీ సాయితి టెక్‌ మల్టీనేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎండీగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల నిఖిల్‌ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె తిరస్కరించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను  మంగళవారం తెల్లవారుజామున తన చాంబర్‌లో చీరతో  ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం దీనిని గుర్తించిన సిబ్బంది ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం  గాంధీ ఆసుపత్రికి తరళించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement