ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి

రెంజల్ (బోధన్): ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు. సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి