మాల్‌లో తుపాకీ మోత.. ఇద్దరి మృతి? | shooting in Colorado Walmart | Sakshi
Sakshi News home page

కొలరాడొ మాల్‌లో కాల్పులు

Nov 2 2017 8:15 AM | Updated on Sep 2 2018 4:03 PM

shooting in Colorado Walmart  - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. భారత కాల మానం ప్రకారం గురువారం ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్‌టన్‌ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు.

సబ్‌అర్బన్‌ డెన్‌వర్‌లోని వాల్‌మార్ట్‌ మాల్‌లో తుపాకీ మోత మోగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మాల్‌ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలీటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు.

సుమారు ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిగాయని.. మాల్‌లో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేశారని మార్ట్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. స్థానిక ఛానెళ్లు మాత్రం 30 రౌండ్ల దాకా కాల్పులు జరిగాయని, 9 మంది గాయపడ్డారని చెప్పటం గమనార్హం.  ఘటనకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా?, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement