భర్త నల్లగా ఉన్నాడని తగలెట్టేసింది!

She is Fair and He Is Dark So Bareilly Wife Sets Husband on Fire - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌, బరేలిలో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య పెట్రోల్‌పోసి తగలెట్టేసింది. ఈ అమానుష ఘటన గత సోమవారం జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల కిత్రమం పెళ్లైంది. వీరిద్దరికి సంతానంగా 5 నెలల పాప ఉంది. చూడటానికి అందంగా ఉండే ప్రేమ్‌ శ్రీ తన భర్త సత్యవీర్‌ సింగ్‌ నల్లగా ఉన్నాడని బాధపడేది. ఎప్పుడు అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవపడేది. ఇదంతా మాములేనని కుటుంబసభ్యులు భావించగా.. ప్రేమ్‌శ్రీ వారు ఊహించని ఘాతుకానికి పాల్పడింది. తన భర్త నల్లగుండటం తట్టుకోలేక.. నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టింది. దీంతో తీవ్రగాయాలైన సత్యవీర్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు హర్వీర్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రేమ్‌శ్రీ కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top