రెండో భార్యకు తలాక్‌.. మొదటి భార్యతో పెళ్లి | Second Wife Complains on Husband Triple Talaq Karnataka | Sakshi
Sakshi News home page

రెండోభార్యకు తలాక్‌.. ఫిర్యాదు

Oct 3 2019 8:51 AM | Updated on Oct 3 2019 8:55 AM

Second Wife Complains on Husband Triple Talaq Karnataka - Sakshi

రెండో భార్యతో జాకీర్‌ (ఫైల్‌)

ట్రిపుల్‌ తలాక్‌ను కేంద్రం నిషేధించినప్పటికీ కొందరు స్వార్థం కోసం తలాక్‌ను ఉపయోగించుకుంటున్నారు.

కర్ణాటక, కృష్ణరాజపురం (బెంగళూరు): ట్రిపుల్‌ తలాక్‌ను కేంద్రం నిషేధించినప్పటికీ కొందరు స్వార్థం కోసం తలాక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో విద్యావంతులూ ఉండడం గమనార్హం. దశాబ్ద కాలం క్రితం తలాక్‌ చెప్పిన మొదటి భార్యను మళ్లీ పెళ్లాడడానికి ఓ టెక్కీ రెండో భార్యకు తలాక్‌ చెప్పిన ఘటన బుధవారం బెంగళూరు ఆర్‌టీ నగరలో వెలుగు చూసింది. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్‌ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్‌ చెప్పి విడాకులిచ్చాడు. తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది రెండో భార్యకు పుట్టిన బిడ్డ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందడంతో ఆమెకు కూడా కొన్నిరోజుల కిందట తలాక్‌ చెప్పేశాడు. మళ్లీ మొదటి భార్యను పునర్వివాహమాడాలని యత్నిస్తున్నాడు. దీంతో రెండో భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement