
అత్తాపూర్: బాలుడిపై లైంగికదాడి జరిగిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జనచైతన్య ప్రాంతంలో మహ్మద్ అబేద్ అలీ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న సెయింట్ అడమ్స్‌స్కూల్‌లో అబేద్ అలీ కుమారుడు (8) రెండవ తరగతి చదువుతున్నాడు.
కాగా కొద్దిరోజులగా స్కూల్ కరస్పాండెంట్ రమణ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విద్యార్థి పాఠశాలలో తనపై జరిగిన ఘటన గురించి గురువారం ఉదయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పొలీసులు దర్యాప్తు చేస్తున్నారు.