సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

SAIL Chairman Attacked by Armed Men With Iron Rods in South Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  భారతదేశపు అతిపెద్ద  ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరి (58) పై హత్యాయత్నం వార్త కలకలం రేపింది.  విధులు  ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన కారును  దుండగులో మరో కారుతో ఢీకొట్టారు. దీంతో అనిల్‌, ఆయన డ్రైవర్‌ కిందకు దిగి ప్రశ్నించారు. కారులో ఉన్న సాయుధులైన నలుగురు యువకులు ఇనుప రాడ్లతో ఒక్కసారిగా వీరిపై దాడికి తెగబడ్డారు.  అయితే తృటిలో వారిరువురూ ప్రాణా పాయం నుంచి  బయటపడ్డారు. బుధవారం రాత్రి దక్షిణ దిల్లీలోని హౌజ్‌ ఖాస్‌ ప్రాంతంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 

ఈ ఘటనపై  సెయిల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సెయిల్‌ అందించిన సమాచారం ప్రకారం కారుతో ఢీకొట్టిన  నిందితుల్లో ఒకరు డ్రైవర్‌ను అతని మెడకు పట్టుకోగా, మిగతా ముగ్గురు  అనిల్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో అనిల్‌ తల, మెడ, కాళ్లపై ఐరన్‌ రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న డిఫెన్స్ కాలనీకి చెందిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది దాడిని చూసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనిల్‌ను రక్షించి ఎయిమ్స్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఛైర్మన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారనీ, డ్రైవర్‌కూడా క్షేమంగా ఉన్నాడని  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురువారం  ఒక ప్రకటనలో  వెల్లడించింది. 

మరోవైపు ఇది యాదృచ్ఛికంకా జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే ఛైర్మన్‌పై దాడి చేసి ఉంటారని  పెరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top