యువకుడు ఆత్మహత్య | Sai Avinash Commits Suicide in Srikakulam | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Jan 23 2019 8:23 AM | Updated on Jan 23 2019 8:23 AM

Sai Avinash Commits Suicide in Srikakulam - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్లో) సాయిఅవినాష్‌ (ఫైల్‌ ఫొటో)

శ్రీకాకుళం, జి.సిగడాం: మండలంలోని నాగులవలస గ్రామానికి చెందిన రాయపురెడ్డి సాయి అవినాష్‌(18) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సాయి అవినాష్‌ సోమవారం రాత్రి ఇంటికి చేరాడు. ఎప్పట్లాగే తమ్ముడితో కలిసి నిద్రపోయాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు పంచె కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయి అవినాష్‌ తండ్రి ముకుందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement