సూట్‌కేసులో శవాన్ని కుక్కి.. హాల్లో పడేశారు!

Russian Instagram Fame Body Found In Suitcase In Her Flat - Sakshi

మాస్కో : రష్యన్‌ ట్రావెల్‌ బ్లాగర్‌, సోషల్‌ మీడియా స్టార్‌ ఎక్టరీనా కరగ్లనోవా(24) దారుణ పరిస్థితిలో శవమై తేలారు. గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు కోసి పాశవికంగా హతమార్చారు. అనంతరం శవాన్ని సూట్‌కేసులో కుక్కి తన ఫ్లాట్‌లోనే పడవేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా కథనం ప్రకారం..డెర్మటాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఎక్టరీనా ప్రస్తుతం మాస్కోలో నివసిస్తున్నారు. ట్రావెలింగ్‌ను ఇష్టపడే ఆమె తరచుగా తన అనుభవాలను ఓ బ్లాగ్‌లో పొందుపరిచేవారు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఎక్టరీనాకు.. కొంతకాలం క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఎక్టరీనా నుంచి ఫోన్‌ రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మాస్కోలోని తన ఫ్లాట్‌కు వచ్చి చూడగా హాలులోని ఓ సూట్‌కేసు కనిపించింది. దానిని తెరచి చూడగా అందులో ఆమె శవం కనిపించింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటనాస్థలంలో హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం, సీసీటీవీ ఫుటేజీ కూడా స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. కాగా ఎక్టరీనా ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top