
గోనె సంచిలో సాంబయ్య శవం
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద గోనె సంచిలో శవం కలకలం సృష్టించింది. ఇద్దరు రౌడీల వర్గపోరు హత్యకు దారితీసింది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సాంబయ్య, బాలాజీ నగర్‌కు చెందిన ప్రతి కుమార్‌ల మద్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రతి కుమార్ సాంబయ్య తల నరికి శవాన్ని గోనె సంచిలో కట్టి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద వదిలేశాడు. అయితే అందులో కేవలం మొండెం మాత్రమే ఉంది, తల లేదు. తల కోసం గాలించగా కాశిబుగ్గలోని ప్రధాన రహదారి డివైడర్‌పై ఓ సంచిలో తల దొరికింది. దారుణ హత్యతో జనం గుండెలు గుభేలు మంటున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.