నాగపూర్‌ ట్రైన్‌లో దొంగల బీభత్సం

Robbery In Nagpur Secunderabad Express At Mandamarri - Sakshi

మహిళల మెడల్లోంచి ఐదున్నర తులాల బంగారం అపహరణ 

పోలీసుల ముమ్మర గాలింపు.. అయినా ఫలితం శూన్యం

మందమర్రిరూరల్‌/మంచిర్యాలక్రైం: సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌ వెళ్లే ట్రైన్‌లో శనివారం ఉద యం దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళల మెడల్లో నుంచి ఐదున్నర తులాల బంగారం అపహరించుకుని ట్రైన్‌ చైన్‌ లాగి పరారయ్యారు. రైల్వే సీఐ కర్రె స్వామి కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌కు ట్రైన్‌ బయలుదేరింది. రవీంద్రఖని స్టేషన్‌ దాటిన తర్వాత మందమర్రి రైల్వేస్టేషన్‌ రాకముందు ట్రైన్‌లోనే వస్తున్న దొంగలు ప్రయాణికులు హైదరాబాద్‌కు చెందిన కల్పన మెడలో నుంచి తులంన్నర, సుష్మా రాంబాయి మెడలోంచి తులం, షేక్‌ తల్వాల్‌ మెడలోంచి మూడు తులాలు మొత్తం ఐ దున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుని ట్రైన్‌ చైన్‌ లాగి, రైలు ఆగగానే దిగి పరారయ్యారు.

ట్రైన్‌లో ఉన్న పోలీస్‌ సిబ్బంది నిందితులను పట్టుకునేందుకు గాలింపులు జరిపినా ఫలితం లేకుం డా పోయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు జాగిలాలతో గాలించినా దొంగల ఆచూకీ దొర కలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ వివరించారు. దొంగలు పారిపోతున్న సమయంలో పోలీస్‌ సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, దొంగతనానికి పాల్పడిన వారిలో 8 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. రైల్లో ప్రయణిస్తున్న సమయంలో నిద్రిస్తున్న మహిళలను టార్గె ట్‌ చేసి తరుచుగా దొంగతనాలకు పాల్పడే ముఠాగా అనుమానిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

అదుపులో అనుమానితులు!
రైల్లో జరిగిన దొంగతనం నేపథ్యంలో మంచిర్యా ల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచి ర్యాల ఏసీపీ, బెల్లంపల్లి ఏసీపీ, కాగజ్‌నగర్‌ పోలీ సులు ఆయా ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్, లాడ్జీలు, వాహనాలతోపాటు బస్సులు, ఇతర వా హనాలను అర్ధరాత్రి నుంచే తనిఖీ చేశారు. కాగా, ఈ దోపిడి జరిగిన తర్వాత జీఆర్‌పీ పోలీసులు కొంతమంది పాత నేరస్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో మరీ అనుమానస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది.

అనుమానితుడిని రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న జీఆర్‌పీ పోలీసులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top