తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం | Robbery Attempt in Telangana Grameena Bank | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం

Jan 1 2018 1:30 PM | Updated on Aug 30 2018 5:24 PM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని ఆదివారం అర్థరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.

సాక్షి, రంగారెడ్డి‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని ఆదివారం అర్థరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక గోడకు రంధ్రం వేసి దుండగులు లోనికి ప్రవేశించారు.

లాకర్‌ తెరిచేందుకు ప్రయత్నించగా అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో దుండగులు పరారయ్యారు. సోమవారం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది చోరీ యత్నాన్ని గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement